

ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిత్ర మండలి' (Mithra Mandali). అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడీ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటించారు.
జంగ్లీ పట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేశ్)కు తన కులం అంటే పిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు వేరే కులాల వాళ్ల రక్తాన్ని ఎక్కించుకోవాల్సి వచ్చినా వద్దనే రకం. ఇక కులాంతర వివాహాలైతే అస్సలు ఒప్పుకోడు. అలాంటి నారాయణ తన కుల బలంతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఒక ప్రముఖ పార్టీ టికెట్ ఇవ్వడానికీ ముందుకొస్తుంది.
ఇంతలో నారాయణ కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి, తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయంతో వెతకడం మొదలుపెడతారు. స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్) ఉన్నట్టు తేలుతుంది. ఈ నలుగురిలో స్వేచ్ఛ ఎవరికోసం ఇంటి నుంచి బయటికొచ్చింది? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురూ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? వీళ్లని నారాయణ ఏం చేశాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.













కామెంట్స్ (4)
‘మిత్ర మండలి’ కథ చూస్తుంటే సరదా, సస్పెన్స్, సోషల్ మెసేజ్ అన్నీ కలగలిసినట్టు ఉంది
Can’t wait to watch Mithra Mandali on OTT!
good mve
Can’t wait to watch Mithra Mandali on OTT!