
రాజకీయాలు

మాలీవుడ్ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియట్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. పెద్దగా ప్రమోషన్లు లేకపోయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ నుంచి నెగటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోయాయి.
ప్రత్యేకంగా సినిమా సెకండాఫ్‌పై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ చిత్రం జూన్ 5 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, నయనతార, కుంచాకో బోబన్, రేవతి కీలక పాత్రల్లో నటించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!