

మొబైల్ ఫోన్ వినియోగం పెరగడంతో ప్రపంచం ఇప్పుడు మన చేతిలోనే కనిపిస్తోంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలు, సిరీస్‌లు ఎక్కడ ఉన్నా సులభంగా చూసే అవకాశం వచ్చింది. ఈ కారణంగా చాలా మంది కొరియన్ సినిమాలు, సిరీస్‌లకు అభిమానులయ్యారు. ముఖ్యంగా కొందరు యువతులు వాటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.
ఈ నేపథ్యంతోనే కొరియన్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా మేడ్ ఇన్ కొరియా. ఇందులో ఓజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 12 న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో చిన్నప్పటి నుంచే కొరియా వెళ్లాలని కలలుగన్న ఒక అమ్మాయి కథను చూపించారు. పెద్దయ్యాక తన కలను నెరవేర్చుకునేందుకు కొరియా వెళ్తుంది. అయితే అక్కడ ఆమె ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటుంది.
ట్రైలర్లో హీరోయిన్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మనకు నచ్చిన పని కోసం ఎంతదూరమైనా వెళ్లాలని, తెలియని వారు మనపై ప్రేమ చూపిస్తారని, కానీ దగ్గరగా తెలిసినవారే కొన్నిసార్లు మనల్ని బాధపెడతారని ఆమె చెబుతుంది. జీవితంలో నవ్వులు, కన్నీళ్లు ఉన్నా చివరికి మనకు తోడుగా నిలిచే వాళ్లు ఉంటారని చెప్పే భావోద్వేగ సంభాషణ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 12 న విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!