
సినిమాలు

ముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లీడర్’ చిత్రం త్వరలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్పై యాక్షన్, తండ్రీకూతుళ్ల భావోద్వేగ కథాంశంతో రూపొందింది. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ సొంతం చేసుకోగా, ఈ నెల 29 నుంచి ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించగా, శ్యామ్, ఆండ్రియా జెరెమియా, సంతోష్ ప్రతాప్, లాల్, ప్రభాకర్, అమృత అయ్యర్ కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ నిర్మించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!