.png&w=3840&q=75)

రియలిస్టిక్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు మణికందన్ తెరకెక్కించిన కొత్త వెబ్ సిరీస్ ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ‘కాకా ముట్టై’, ‘కడైసి వివసాయి’ వంటి సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్న ఆయన ఈసారి వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి జియో హాట్‌స్టార్(JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు. సంగీతాన్ని రాజేష్ మురుగేశన్ అందించారు. విజయ్ సేతుపతి – మణికందన్ కాంబినేషన్లో ఇప్పటికే ‘ఆండవన్ కట్టలై’, ‘కడైసి వివసాయి’ వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. అవి విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఇప్పుడు అదే కాంబినేషన్లో వెబ్ సిరీస్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మేకర్స్ తెలిపిన ప్రకారం, ఈ వెబ్ సిరీస్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర చాలా ఉగ్రంగా, ఇప్పటివరకు కనిపించని విధంగా చూపించనున్నారు. కథలో యాక్షన్ మరియు హింస కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా సమాచారం.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!