
క్రీడలు

ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా మెప్పించిన జ్యోతిక ఇప్పుడు ‘సిస్టమ్’ అనే కోర్ట్ రూమ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతికతో పాటు సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ కీలక పాత్రల్లో నటించారు. అశ్వినీ అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ‘న్యాయం దేవుడి లాంటిది.. వెతికి పట్టుకోవడం చాలా కష్టం’ అనే డైలాగ్ చూస్తే న్యాయవ్యవస్థలోని లోపాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!