
జనరల్

తెలుగు టెలివిజన్‌పై 17 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ఇప్పుడు డిజిటల్ వేదికపైనా సందడి చేస్తోంది. ‘ఢీ డబుల్ ఇంపాక్ట్’ పేరుతో 21వ సీజన్ సెప్టెంబర్ 19, 2026న నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ వేదికలపై పలు భాషల్లో ప్రారంభమైంది. ఈటీవీ విన్‌లో తొలి రెండు ఎపిసోడ్‌లకే విశేష స్పందన లభించింది. ఈ రెండు ఎపిసోడ్‌లకు కలిపి 61,25,468 వ్యూస్ నమోదయ్యాయి.
ఒక్కో వ్యూకు సగటున 7.3 నిమిషాల వీక్షణ సమయం లెక్కన, ఈ ఎపిసోడ్‌లు దాదాపు 4.48 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా తిరిగి రాగా, అనుపమ పరమేశ్వరన్, జానీ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తేజస్వి మదివాడ, నిఖిల్ విజయేంద్ర సింహా పోటీపడుతున్న జట్లకు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!