

తెలుగు నటుడు అల్లరి నరేశ్, గతంలో తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు అంతగా విజయవంతం కాలేదు. ఈ సారి ఆయన “12A రైల్వే కాలనీ” అనే హారర్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని 'పొలిమేర' రెండు సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా తెరకెక్కించారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమా గత నెల 21 న థియేటర్లలో విడుదలై, మొదటి షో నుంచే ప్రతికూల(negative) టాక్ తెచ్చుకుంది. ఫలితంగా పెద్దగా స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు ఎటువంటి ప్రకటన లేకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే — కార్తీక్ (అల్లరి నరేశ్) అనే అనాథ వరంగల్‌లోని రైల్వే కాలనీలో స్నేహితులతో జీవిస్తుంటాడు. టిల్లు (జీవన్) అనే లోకల్ రాజకీయ నాయకుడి కోసం పని చేస్తాడు. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన టిల్లు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటూ ప్రచారం కోసం కార్తీక్‌కు బాధ్యతలు అప్పగిస్తాడు. యువతను ఆకర్షించేందుకు క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన కార్తీక్, ఆ సమయంలో ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ ఒకరోజు ఆకస్మికంగా జరిగే రహస్య హత్యలు కథలో కొత్త మలుపు తిప్పుతాయి. ఆ సంఘటనలతో కార్తీక్ ఆరాధన గురించి నిజాలు, ఆ హత్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకుంటాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!