
బిజినెస్

రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో ఈ రోజు ఉదయం భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడం, భారీ శబ్ధం వినిపించడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
స్థానికుల ప్రకారం ఉదయం 9:30 గంటల సమయంలో గట్టిగా శబ్ధం వినిపించి, కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఇంట్లోని వస్తువులు కదలడం, పాత్రలు శబ్ధం చేయడంతో ప్రజలు మరింత భయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. ఇది భూకంపమా లేదా సమీపంలోని రాళ్ల గనుల్లో జరిగిన పేలుళ్ల కారణంగా వచ్చిందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!