

2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో లడ్డూ విక్రయాల్లో గత ఏళ్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) గణాంకాల ప్రకారం, 2025 సంవత్సరంలో మొత్తం 13.52 కోట్ల లడ్డూలు భక్తులకు అందించబడ్డాయి. ఇది గత ఏడాది నమోదైన 12.15 కోట్ల విక్రయాలతో పోలిస్తే సుమారు 1.37 కోట్ల లడ్డూలు అధికం కావడం విశేషం.
డిసెంబర్ 28, 2025 న ఒక్కరోజులోనే 5.12 లక్షల లడ్డూలు అమ్ముడవ్వడం ద్వారా మరో అరుదైన రికార్డు నమోదైంది. తిరుమల చరిత్రలో ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో లడ్డూ విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని టీటీడీ అధికారులు తెలిపారు.
సాధారణ రోజుల్లోనూ లడ్డూ డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ సగటున 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు లడ్డూలు భక్తులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ గణాంకాలు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల ఆదరణ ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తున్నాయి.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!