
సినిమాలు

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. టికెట్ ధరలను పెంచాలంటే సినిమా విడుదలకు తొంభై రోజుల ముందే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు మహేశ్వరి మరియు ఏ.ఎస్. చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించి హైకోర్టు ఉత్తర్వులపై నిలిపివేత విధించింది. టికెట్ ధరల నిర్ణయంపై ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!