
న్యూస్

దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని రవాణాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న లెర్నర్స్ లైసెన్స్ (LLR), శాశ్వత డ్రైవింగ్ టెస్ట్‌తో పాటు కొత్తగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఆన్లైన్ టెస్ట్‌ను తప్పనిసరి చేయనున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త విధానం ప్రకారం ఆరు మాడ్యూళ్లతో కూడిన రోడ్ సేఫ్టీ టెస్ట్‌ను అభ్యర్థులు ఇంటి నుంచే రాయవచ్చు. ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాలపాటు ఉండగా మొత్తం పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. ఈ టెస్ట్‌లో రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాలు, ప్రమాదాల నివారణపై వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే లెర్నర్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.




















.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!