

భారత దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా పేరుగాంచిన ముకేశ్ అంబానీ, మరోసారి తన భక్తి, సేవా మనసును చాటుకున్నారు. తన తండ్రి ధీరూభాయి అంబానీ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వ్యాపారాన్ని లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లిన ఆయన, ఆధ్యాత్మికతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఇటీవల ఒకే రోజులో ముకేశ్ అంబానీ మూడు ప్రముఖ దేవాలయాలను సందర్శించి, మొత్తం రూ.165 కోట్ల విరాళాలు ప్రకటించారు. ఈ విరాళాల వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంను దర్శించిన అంబానీ, అక్కడి అన్నదానం ట్రస్టుకు రూ.100 కోట్ల విరాళం అందించారు. రోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కొత్త వంటశాలను నిర్మించడానికి, దాని నిర్వహణ కోసం ఈ నిధులు వినియోగించబడతాయి.
తర్వాత ఆయన రాజస్థాన్లోని నాథ్ద్వారా శ్రీకృష్ణ ఆలయంకు వెళ్లి, ఆ దేవస్థానానికి రూ.50 కోట్ల విరాళం అందించారు. ఆ తరువాత కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించి, అక్కడి ఆసుపత్రి అభివృద్ధి కోసం మొదటి విడతగా రూ.15 కోట్ల విరాళం ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సహాయాలు అందిస్తానని కూడా హామీ ఇచ్చారు.
కేవలం కొన్ని గంటల వ్యవధిలో మూడు ఆలయాలకు 165 కోట్ల విరాళాలు ఇవ్వడం ముకేశ్ అంబానీ భక్తిని, సేవాభావాన్ని మరోసారి రుజువు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!