

ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ నాయకత్వంపై జరిపిన భారీ దాడులకు సంబంధించిన కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 28న “ఆపరేషన్ లయన్స్ రోర్”లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ తదుపరి నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. ఇదే ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు సుమారు 40 మంది కీలక నేతలు, సైనికాధికారులు మరణించినట్లు సమాచారం. ముజ్తబా భార్య జహ్రా కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు చెబుతున్నాయి.
దాడి సమయంలో ముజ్తబా తన తండ్రితో కలిసి ఆయతుల్లా కాంపౌండ్‌లో ఉన్నారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అలాగే ఆయనకు అయిన గాయాల తీవ్రతపై కూడా అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఇరాన్‌లోని శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స (IRGC) పై ముజ్తబాకు బలమైన ప్రభావం ఉండటంతో ఆయననే ఖమేనీకి వారసుడిగా భావిస్తున్నారు. అయితే గార్డియన్ కౌన్సిల్‌లోని కొంతమంది సభ్యులు అధికారాన్ని వారసత్వంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ముజ్తబాకు అధికారం అప్పగించడాన్ని అంగీకరించడం లేదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!