

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం అధికారికంగా ఖరారు కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇంతకాలం హర్మూజ్ జలసంధిపై కొనసాగిన ఆంక్షలు సడలించబడటంతో కనీసం ఐదు ఇరాన్ నౌకలు ఆ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. ఈ పరిణామం ప్రపంచ ఇంధన సరఫరా మార్గాల పునరుద్ధరణకు తొలి సంకేతంగా భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు జరిగినట్లు సమాచారం. జెనీవాలో అధికారిక కార్యక్రమం జరగనుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి దశ చర్చల్లో హర్మూజ్ జలసంధి, ఆంక్షలు, పునర్నిర్మాణ అంశాలు ప్రధానంగా ఉంటాయి. అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు రెండో దశ చర్చల్లో ప్రస్తావనకు రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!