

జమ్మూ–కశ్మీర్లో గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ హిమపాతం ప్రజాజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పలు ప్రాంతాలు పూర్తిగా శ్వేతవర్ణంలోకి మారగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కీలక రహదారులను మూసివేశారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వేలాది వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. మొఘల్ రోడ్డు, శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారి, సింతాన్ రోడ్లను కూడా తాత్కాలికంగా మూసివేశారు.
మంచు కురుస్తుండటంతో రైల్వే, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమాన రాకపోకలను నిలిపివేశారు. పూంచ్, ఉదంపుర్ జిల్లాల్లో చిక్కుకుపోయిన సుమారు 100 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మాతా వైష్ణో దేవి ఆలయంలో కూడా హిమపాతం కారణంగా కొంతసేపు యాత్ర నిలిపివేశారు. అవలాంచ్ ప్రమాదం ఉన్న ఆరు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ, స్థానికులు మరియు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!