
గాసిప్స్

తొమ్మిదో రోజుకి చేరుకున్న ఇండిగో విమానాల సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈరోజు మాత్రమే 220 ఇండిగో విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి రావడం లేదని గుర్తించిన అధికారులు, ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి ఎన్ఎఫ్ఆర్ఏ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులపై ప్రభావం తగ్గించేందుకు, ఇతర విమాన సంస్థలకు తాత్కాలికంగా కొన్ని రూట్లపై అత్యవసర సర్వీసులు కేటాయించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో సేవలను సర్దుబాటు చేస్తూ, పరిస్థితిని మెరుగుపరచేందుకు DGCA పలు తక్షణ మార్పులు చేస్తున్నట్టు సమాచారం. సంక్షోభం ఎప్పుడు పూర్తిగా తీరుతుందనే ప్రశ్న మాత్రం ఇంకా నిలిచే ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!