

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణశాఖ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా రహదారి రవాణా, ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండనుందని అంచనా వేశారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో దృశ్యమానత తగ్గే అవకాశముందని తెలిపారు.
పండగల సందర్భంగా తిరుగు ప్రయాణాలు చేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచనలు జారీ చేసింది. ఈ విషయాన్ని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం వెల్లడించారు. పొగమంచు పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని, ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని ఆయన తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!