
గాసిప్స్

తెలంగాణలో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం తెలంగాణలో నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. గత కొద్ది రోజులుగా పట్టణాల్లో హోరెత్తిన ప్రచార రథాల మైకులు నేడు సాయంత్రం 5 గంటలకు మూగబోనున్నాయి. నేడు ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం స్థానికేతరులు ఎవరూ మున్సిపాలిటీల్లో ఉండకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!