
న్యూస్

తమిళనాడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అడయార్ ప్రాంతంలో జనవరి 5 నుంచి వరుసగా కాకులు మృతిచెందాయి. వాటి నమూనాలను పరిశీలించిన జాతీయ పశువైద్య పరిశోధన సంస్థ, ఆ కాకుల మరణానికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో చెన్నై నగరంతో పాటు తిరువళ్లూర్, తిరువణ్ణామలై, కడలూరు వంటి మొత్తం 14 జిల్లాల్లో కాకులు బర్డ్ ఫ్లూ వల్ల మృతిచెందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరి ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.
అయితే ఈ వ్యాధి ఇప్పటివరకు ఇతర పక్షులకు లేదా మనుషులకు సోకలేదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా జ్వరం లేదా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!