

తక్కువ సినిమాలతోనే భారీ విజయాలు సాధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అన్ని కమిట్మెంట్లు పూర్తయ్యాక మైథాలజీ జానర్లో సినిమా చేయాలనే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. దీని కోసం ఎన్నేళ్లుగానో ఓ కథపై పని చేస్తున్నట్లు చెప్పడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన ఆయన నుంచి మైథాలజీ సినిమా వస్తే ఎలా ఉంటుందోనని చర్చలు మొదలయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!