

రామాయణ రెండో భాగంలో హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటించనుండటంతో ఈ పాత్రపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ హనుమంతుడి వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణాలను వివరించారు. అమాయకత్వం, అపారమైన భక్తి, ఊహించలేనంత బలం ఆయనలో ఉంటాయని పేర్కొన్నారు. కోపం వచ్చినప్పుడు పర్వతాలను సైతం కదిలించగల శక్తి హనుమంతుడి సొంతమని వివరించారు.
ఈ లక్షణాలన్నింటికీ సన్నీ డియోల్ తెరపై చూపించే ప్రభావవంతమైన నటన, గంభీరమైన వ్యక్తిత్వం సరిగ్గా సరిపోతాయని నిర్మాత అభిప్రాయపడ్డారు. అందుకే ఈ కీలక పాత్రకు ఆయన సరైన ఎంపికగా భావించినట్లు తెలిపారు. సన్నీ డియోల్ ఇప్పటికే తనదైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి నటుడు హనుమంతుడి పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా ఆయన రూపం, పాత్ర చిత్రణ, యాక్షన్ సన్నివేశాలను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!