25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

Writer: Pooja 09:35 AM, 25 నవంబర్, 2026
ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అంతర్గతంగా అత్యంత కీలకమైన ‘కోడ్‌ రెడ్‌’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తన సాఫ్ట్‌వేర్లు, సేవల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి, వీలైనంత త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టింది. ఈ నెల 12, 13 తేదీల్లో దాదాపు 24 గంటలపాటు ఎదురైన సాంకేతిక అంతరాయాల కారణంగా ఔట్‌లుక్‌, టీమ్స్‌, కోపైలట్‌ వంటి సేవలను వినియోగించే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జులైలో ప్రవేశపెట్టిన ఓ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లోని లోపం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు సంస్థ గుర్తించింది. ఈ లోపాన్ని దాదాపు నాలుగు నెలలపాటు గుర్తించలేకపోయినట్లు వెల్లడించింది. అయితే, ఈ అంతరాయానికి హ్యాకింగ్‌ లేదా ఏఐ ఏజెంట్ల దాడులు కారణం కాదని అప్పట్లో స్పష్టం చేసింది.

సాధారణంగా మైక్రోసాఫ్ట్‌ తన 365 సేవలు 99.9 శాతం సమయం అందుబాటులో ఉంటాయని హామీ ఇస్తుంది. అంటే నెలకు సగటున 44 నిమిషాల డౌన్‌టైమ్‌ మాత్రమే ఉండాలి. అయితే ఇటీవల తలెత్తిన సమస్యతో సుమారు 24 గంటలపాటు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో సమస్యను పరిష్కరించే బాధ్యత కలిగిన 11 బృందాల మధ్య సుమారు 11 వేల సందేశాలు మార్పిడి జరిగినప్పటికీ, వారికి అవసరమైన డేటా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత్‌ సహా 74 దేశాల్లోని వినియోగదారులు ప్రభావితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌లు చేరేందుకు కూడా ఎక్కువ సమయం పడుతున్నట్లు సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలో సమస్యలను సాధ్యమైనంత త్వరగా, గంటలోపు పరిష్కరించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు ‘సిల్వర్‌ మెమో’ పంపడంతో పాటు, కోడ్‌ రెడ్‌ కింద ఐదు రకాల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ సీఈవోలుగా పగ్గాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు

పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ సీఈవోలుగా పగ్గాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు

24 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్.. మాజీ ఉద్యోగిని ఆవేదన ఇదే!

24 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్.. మాజీ ఉద్యోగిని ఆవేదన ఇదే!

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ దిగ్గజ సంస్థలపై హ్యాకర్ల దాడులు

మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ దిగ్గజ సంస్థలపై హ్యాకర్ల దాడులు

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్కోడ్ రెడ్మైక్రోసాఫ్ట్ 365ఔట్‌లుక్ సేవలుటీమ్స్ అంతరాయంకోపైలట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం
జనరల్

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం
రాజకీయాలు

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?
గాసిప్స్

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?
సినిమాలు

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?
సినిమాలు

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

పవన్ సినిమాను అందుకే వదులుకున్న సంపత్ నంది?
సినిమాలు

పవన్ సినిమాను అందుకే వదులుకున్న సంపత్ నంది?

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌
జనరల్

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

వివేక్ ఆత్రేయతో శివకార్తికేయన్ సినిమా?
గాసిప్స్

వివేక్ ఆత్రేయతో శివకార్తికేయన్ సినిమా?

హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ఎందుకంటే?
సినిమాలు

హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ఎందుకంటే?

భోగి ప్రచారంలో అనుపమ కనిపించకపోవడమేంటి?
గాసిప్స్

భోగి ప్రచారంలో అనుపమ కనిపించకపోవడమేంటి?

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం
జనరల్

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!