

అక్కినేని నాగ చైతన్య హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. యువ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సినిమా కథ, అందులోని పాత్రల గురించి మరింత తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కానుండటంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. ట్రైలర్ ద్వారా సినిమా అసలు కథాంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదిరిపోయే ట్రైలర్‌ను తీసుకొస్తున్నామని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి నాగ చైతన్య ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంటారా? ట్రైలర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!