25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

Writer: Pooja 09:22 AM, 25 నవంబర్, 2026
వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

వాహనాల అసలు గుర్తింపును దాచడం, ట్రాఫిక్‌ నిబంధనల నుంచి తప్పించుకోవడం, చట్టాలను ఉల్లంఘించడం కోసం కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా నంబర్‌ ప్లేట్లను వినియోగిస్తున్నారు. ఈ తరహా ఉల్లంఘనలకు సంబంధించి ఇటీవల బూర్గంపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వాహనంపై కేసు నమోదైంది. ప్రభుత్వం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) వినియోగాన్ని తప్పనిసరి చేసినప్పటికీ కొందరు వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. నంబర్‌ ప్లేట్లపై రాజకీయ నాయకుల ఫొటోలు, పార్టీల జెండాలు, గుర్తులు, సామాజిక వర్గాల పేర్లు, ఇతర వివరాలను ముద్రించి వాహనాలకు అమర్చుతున్నారు. మరికొందరు వింత ఆకృతులు, రంగులు, ఫ్యాన్సీ అక్షరాలతో నంబర్‌ ప్లేట్లను తయారు చేయించుకుంటున్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలను సీజ్‌ కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నప్పటికీ, కొంతమంది రాజకీయ నేతల సిఫార్సులతో కొన్ని వాహనాలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని 50, 51 నిబంధనల ప్రకారం నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు తెలుపు రంగు ప్లేటుపై నల్లని అక్షరాలు, రవాణా వాహనాలకు పసుపు రంగు ప్లేటుపై నల్లని అక్షరాలు ఉండాలి. విద్యుత్‌ వాహనాలకు ఆకుపచ్చ రంగు ప్లేటుపై తెలుపు అక్షరాలు ఉండాలి. నంబర్‌ ప్లేట్లపై ఫ్యాన్సీ అక్షరాలు, పేర్లు, ఫొటోలు, హోదాలు, కులాల పేర్లు, రాజకీయ పదవులు రాయడం నిబంధనలకు విరుద్ధం.

ప్రతి వాహనానికి హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్‌ ప్లేటు తప్పనిసరి. దీనిపై ప్రత్యేకమైన లేజర్‌ కోడ్‌, పది అంకెల క్రోమియం హోలోగ్రామ్‌ స్టిక్కర్‌ ఉంటాయి. వీటి ద్వారా వాహనాలను సులభంగా గుర్తించడంతో పాటు చోరీలకు గురైన వాహనాల ఆచూకీ తెలుసుకోవచ్చు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోయినా, నంబర్లు మసకబారినా, వెలిసిపోయినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రాసినా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 177 ప్రకారం మొదటిసారి రూ.500, తదుపరి ఉల్లంఘనలకు రూ.1,500 జరిమానా విధించవచ్చు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్‌ చేసే అవకాశం ఉంది. నకిలీ నంబర్‌ ప్లేటు వినియోగిస్తే సెక్షన్‌ 192 కింద మొదటిసారి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు, రెండోసారి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాతో పాటు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం

పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన మంజీరా నది

పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన మంజీరా నది

నేటి నుంచి హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర..

నేటి నుంచి హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర..

తిరుమలలో మరో అద్భుత రహదారి..

తిరుమలలో మరో అద్భుత రహదారి..

కార్తీక దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..

కార్తీక దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..

ట్యాగ్లు
ట్రాఫిక్ నిబంధనలుఅక్రమ నంబర్ ప్లేట్లుహెచ్‌ఎస్‌ఆర్‌పీవాహన రిజిస్ట్రేషన్తెలంగాణ పోలీసులుమోటారు వాహనాల చట్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?
సినిమాలు

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?
సినిమాలు

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

పవన్ సినిమాను అందుకే వదులుకున్న సంపత్ నంది?
సినిమాలు

పవన్ సినిమాను అందుకే వదులుకున్న సంపత్ నంది?

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌
జనరల్

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

వివేక్ ఆత్రేయతో శివకార్తికేయన్ సినిమా?
గాసిప్స్

వివేక్ ఆత్రేయతో శివకార్తికేయన్ సినిమా?

హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ఎందుకంటే?
సినిమాలు

హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ఎందుకంటే?

భోగి ప్రచారంలో అనుపమ కనిపించకపోవడమేంటి?
గాసిప్స్

భోగి ప్రచారంలో అనుపమ కనిపించకపోవడమేంటి?

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం
జనరల్

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం
జనరల్

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం

‘దాదా’ కోసం హీరో, విలన్ పోరాటం.. గాయాలైనా షూటింగ్‌కు బ్రేక్ లేదు!
సినిమాలు

‘దాదా’ కోసం హీరో, విలన్ పోరాటం.. గాయాలైనా షూటింగ్‌కు బ్రేక్ లేదు!

పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన మంజీరా నది
జనరల్

పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన మంజీరా నది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!