
బిజినెస్

దర్శకుడు శ్రీను వైట్ల చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు శర్వానంద్‌తో కలిసి కొత్త సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని షూటింగ్‌కు సిద్ధమైంది. జూలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు. శర్వానంద్ స్టైల్‌కు తగ్గట్టుగా వినోదభరితమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్గా అనంతిక సనీల్ కుమార్ నటించనుండగా, ఒక సీనియర్ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిన్నప్పటి తప్పిదం కారణంగా హీరో జీవితంలో జరిగే పరిణామాలపై కథ సాగుతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్ విశ్వాసంగా ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!