
రాజకీయాలు

అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా ట్రైలర్ ఈ నెల 4 న విడుదల కానుంది. ఈ సినిమా ఈ నెల 10 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. రివెంజ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!