

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మూకుతి అమ్మన్ 2’. సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో వచ్చే నెల 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. మొదటి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, ఈ సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారు. గ్రాండ్ విజువల్స్, భారీ గ్రాఫిక్స్, హోరెత్తించే నేపథ్య సంగీతంతో ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. ఓ గ్రామం, అందులోని ఓ కుటుంబం ఎదుర్కొనే సంక్షోభం, వారిని కాపాడేందుకు అమ్మవారు ఎలా ముందుకొచ్చారనే అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. సాధారణ ప్రజలను ఆపద నుంచి రక్షించే దైవశక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. అయితే, ట్రైలర్‌లోని గ్రాఫిక్స్‌పై కొందరు ప్రేక్షకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాతో నయనతార ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!