

నటి పాయల్ రాజ్‌పుత్ తన శరీరాకృతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శరీరం, రూపం గురించి వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు. “నా శరీరం, నా సైజు, నా గర్వం. ఇవి మీకు సంబంధించిన విషయాలు కావు. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీ పని మీరు చేసుకోండి” అంటూ బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న వారికి గట్టిగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత రూపం ఆధారంగా ఇతరులను కించపరచడం సరికాదనే సందేశాన్ని ఆమె తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ప్రస్తుతం పాయల్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 2023లో విడుదలైన ‘మంగళవారం’ సినిమాతో మరోసారి తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అనంతరం ‘రక్షణ’ చిత్రంలో పోలీసు అధికారిణి పాత్రలో కనిపించారు. విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాయల్.. ప్రస్తుతం తన శరీరాకృతిపై వస్తున్న అవమానకర వ్యాఖ్యలకు బహిరంగంగా స్పందించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!