21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓలా, ర్యాపిడోకు పోటీగా రూటూర్‌ యాప్‌

Writer: Pooja 03:29 PM, 21 అక్టోబర్, 2026
ఓలా, ర్యాపిడోకు పోటీగా రూటూర్‌ యాప్‌

డ్రైవర్లపై కమీషన్ల భారాన్ని తగ్గించడం, ప్రయాణికులకు సర్జ్‌ ప్రైసింగ్‌ నుంచి ఉపశమనం కల్పించడం, సురక్షితమైన ప్రయాణ సేవలు అందించడం లక్ష్యంగా వరంగల్‌కు చెందిన యువకుడు వంగేటి నిఖిల్‌ కుమార్‌ తన ఇద్దరు మిత్రులతో కలిసి 2023లో ప్రారంభించిన రూటూర్‌ రైడ్‌ బుకింగ్‌ యాప్‌ వరంగల్‌, హనుమకొండ, కాజీపేట నగరాల్లో సేవలను ప్రారంభించింది. దసరా పండుగ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా, ర్యాపిడో తరహాలో బైక్‌, ఆటో, క్యాబ్‌ సేవలను అందిస్తోంది. తొలుత హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40కిపైగా నగరాలకు విస్తరించినట్లు తెలిపింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదపురం గ్రామానికి చెందిన నిఖిల్‌ కుమార్‌ యూకేలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు. అనంతరం అక్కడే రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఆపరేషన్స్‌ మేనేజర్‌గా ఆరేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలో రవాణా రంగంలోని సమస్యలను గమనించిన ఆయన, డ్రైవర్ల ఆదాయంపై కమీషన్ల ప్రభావాన్ని తగ్గిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే వేదికను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తన డిగ్రీ స్నేహితులైన అక్షయ్‌, గంధం క్రాంతికుమార్‌లతో కలిసి రూటూర్‌ను ప్రారంభించారు. సంస్థలో నిఖిల్‌ సీఈవోగా, క్రాంతికుమార్‌ సీఓఓగా, అక్షయ్‌ సీఎఫ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రయాణికుల భద్రతకు రూటూర్‌ ప్రాధాన్యమిస్తోంది. రూటూర్‌ కెప్టెన్‌ యాప్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే డ్రైవర్ల వివరాలు, పోలీస్‌ క్లియరెన్స్‌ వంటి పత్రాలను పరిశీలించిన తర్వాతే సంస్థ అనుమతి ఇస్తోంది. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రయాణికులు సహాయం పొందేందుకు ఎస్‌ఓఎస్‌ బటన్‌, లైవ్‌ లొకేషన్‌ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం, వారిని సురక్షిత ప్రాంతాల్లో దించడం వంటి అంశాలపై డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రయాణికులు ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ ద్వారా రూటూర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సేవలను వినియోగించుకోవచ్చు. ప్రధాన రహదారుల నుంచి కాలనీల వరకు ప్రయాణాన్ని సులభతరం చేసే చివరి మైలు అనుసంధానంపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. డ్రైవర్ల సంపాదనలో కమీషన్ల రూపంలో కోత పడకుండా వారికి వేదిక కల్పించడమే తమ వ్యాపార నమూనా లక్ష్యమని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సొంత ప్రాంతమైన వరంగల్‌, హనుమకొండ, కాజీపేటల్లో సేవలు ప్రారంభించడం సంస్థకు కీలక ముందడుగుగా నిలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

భారీ ఒడుదొడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ ఒడుదొడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

పుణెలో హ్యుందాయ్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభం

పుణెలో హ్యుందాయ్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ విడుదల.. ధర ఎంతంటే?

కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ విడుదల.. ధర ఎంతంటే?

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కర్ణాటక సరికొత్త పరిష్కారం

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కర్ణాటక సరికొత్త పరిష్కారం

ట్యాగ్లు
రూటూర్ యాప్వరంగల్ స్టార్టప్రైడ్ బుకింగ్డ్రైవర్లకు అనుకూల వేదికప్రయాణికుల భద్రతచివరి మైలు అనుసంధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ
బిజినెస్

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం
రాజకీయాలు

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ
బిజినెస్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే
రాజకీయాలు

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!