

టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ ‘అఖండ 2’ రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్నే. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ సీక్వెల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని విధంగా మేకర్స్ రిలీజ్‌ను వాయిదా వేయడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. ఇప్పుడు అయితే ఈ సస్పెన్స్‌కు సమాధానం బయటకు వస్తున్నట్టు సమాచారం. తాజా బజ్ ప్రకారం, సినిమా విడుదలకు డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 అనే రెండు డేట్స్‌ను పరిశీలిస్తున్నారట. వీటిలో ఒకదాన్ని త్వరలోనే ఫైనల్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా సినిమా ఏ డేట్లో రిలీజ్ అయినా కూడా, ఒక రోజు ముందే గ్రాండ్ ప్రీమియర్స్ పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అంటే డిసెంబర్ 11 లేదా డిసెంబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీమియర్స్ ఉంటాయన్న మాట. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మించారు. సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!