
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ యాడ్‌కు సంబంధించిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ నమోదు చేసింది. ముఖ్యంగా, ఫుట్‌బాల్ స్టార్‌లు మెస్సి మరియు రొనాల్డో కలిసి నటించిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కంటే ఎక్కువ లైక్స్ ఈ విరోష్ జంట మాన్యవార్ యాడ్‌కు రావడం విశేషంగా మారింది.
విజయ్, రశ్మిక మాన్యవార్ యాడ్ పోస్ట్ మొత్తం 8.1 మిలియన్ లైక్స్ సాధించి ప్రపంచ స్థాయి రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో ప్రత్యేక ఘనతగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న అపారమైన అభిమానాన్ని ఈ అరుదైన రికార్డ్ స్పష్టంగా చూపిస్తోంది.
ఇటీవలే విజయ్ దేవరకొండ మరియు రశ్మిక మందన్న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లో వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజయ్ నివాసానికి వెళ్లి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!