

విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘చియాన్ 63’ చిత్రానికి ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. సోమవారం టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సర్వం మాయ’ ఫేమ్ రియా శిబు ఇందులో విక్రమ్‌కు మేనకోడలి పాత్రలో నటిస్తుండగా, ఊర్వశి, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టైటిల్ ప్రోమోలో విక్రమ్ కుటుంబంతో కలిసి క్యాటరింగ్ వ్యాపారం నిర్వహించే సాధారణ వ్యక్తిగా అరటి గెలతో కనిపించారు. తాను చేసే ఏ పనికైనా ‘వంద శాతం గ్యారెంటీ’ ఇస్తానంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాస్యంతో పాటు మాస్ అంశాలను మేళవించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!