
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై ఇవాళ టాలీవుడ్ మాత్రమే కాదు, సినీ ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. వేలాది మంది అభిమానులు ప్రత్యక్షంగా హాజరుకాగా, ఆన్లైన్లో జియో–హాట్‌స్టార్ ద్వారా కోట్లాది ప్రేక్షకులు వీక్షించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి హైప్ కలిగిన ఓపెన్ ఈవెంట్ అరుదేనని చెప్పాలి. పోలీసులు, నిర్వాహకులు చేసిన కఠిన ఏర్పాట్ల వల్ల ఏ చిన్న అవాంచనీయ సంఘటన కూడా జరగలేదు. మొత్తం ఈవెంట్ సాఫీగా ముగిసింది.
ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి తండ్రి మరియు ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు.
ఈ చిత్రంలో అరగంటపాటు కొనసాగే భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉందని, అది CG, VFX, రీ-రికార్డింగ్ లేకుండానే చూసినా మహేష్ బాబు విశ్వరూపం అబ్బురపరిచిందని ఆయన తెలిపారు.
తిరుపతి లాంటి దేవాలయానికి వెళ్తే కలిగే పవిత్రమైన భావన… అదే ఫీలింగ్ ఆ సీక్వెన్స్‌లో వచ్చిందని, రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయని ఆయన చెప్పడం అభిమానుల్లో అదిరిపోయే ఎక్స్సైట్మెంట్ కలిగించింది.
అయితే ఆ 30 నిమిషాల ఎపిసోడ్ ఏ సందర్భంలో వస్తుందో మాత్రం ఆయన చెప్పలేదు—“అన్నీ చెప్పేస్తే జక్కన్న నన్నే బద్దలు కొడతాడు” అని సరదాగా అనీ అన్నారు. ఈ మాటలకు అభిమానులు కేకలు వేస్తూ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.
వారణాసి అనే టైటిల్‌తో వస్తున్న ఈ పాన్-ఇండియా సినిమాకు సంబంధించిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీ జనసందోహం, ఎలాంటి అపశ్రుతి లేకుండా కార్యక్రమం జరగడం అందరిని ఆకట్టుకుంది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దీన్ని ఆసక్తిగా గమనిస్తోంది. విడుదల సమయం ఇంకా దూరమైనా, ఉత్సాహం మాత్రం పీక్‌లో ఉంది.
ఇప్పుడు రాజమౌళి టీమ్ నుండి వచ్చే తదుపరి స్టెప్ ఏదో అన్నది అందరి ఆసక్తిని రేకెత్తిస్తోంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!