
జనరల్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఆయన తదుపరి సినిమా ‘రౌడీ జనార్ధన’పై అందరి దృష్టి పడింది. యువ దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మేకర్స్ తొలుత ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఏడాది ముగింపు సమీపిస్తుండటం, ఇప్పటికే పలు సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకోవడంతో ‘రౌడీ జనార్ధన’ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!