
జనరల్

ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ నెల 14న నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటలోని తమ స్వగ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ మేనేజర్ కన్నారావు మీడియాకు తెలిపారు. గతంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించిన ఈ దంపతులు, గ్రామ ప్రజలతో ఆత్మీయంగా కలుసుకున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ తన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!