

ప్రముఖ తమిళ సినీ నిర్మాత కె రాజన్ ఆదివారం చెన్నై అడైయారులోని కూవం నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ను కారు ఆపమని చెప్పి, అనంతరం నదిలోకి దూకినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధల కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని సమాచారం.
1983లో విడుదలైన ‘బ్రమ్మచారిగళ్’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన కె.రాజన్, ‘అవళ్ పావం’, ‘నినైక్కాద నాళిలై’ వంటి చిత్రాలను నిర్మించారు. చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సేవలందించారు. నటుడిగా ‘పాంబు సట్టై’, ‘తుణివు’, ‘బకాసురన్’ సహా పలు చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా, కథా రచయితగా కూడా గుర్తింపు పొందిన ఆయన మృతి తమిళ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!