

విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత పాట విడుదలపై స్పష్టత లేకుండా పోయింది.
తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న ఈ పాటను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్‌కు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!