

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా నయనతార కనిపిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన పాత్ర కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల చిరంజీవి–వెంకటేష్ కలిసి నటించిన ఒక పాటను కూడా విడుదల చేయగా, దానికి మంచి స్పందన లభిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో నటించినందుకు వెంకటేష్ రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సుమారు రూ.70 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇవన్నీ అధికారికంగా ధృవీకరించబడని సమాచారం మాత్రమేనని గమనించాలి.
సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా, స్టార్ కాస్టింగ్‌తో పాటు స్పెషల్ అపియరెన్స్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!