

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి వారాంతంలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో వారంలోనూ అదే జోరును కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారాంతానికి రూ.1,000 కోట్ల మార్కును దాటవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
భారతీయ చిత్రాల్లో ‘బాహుబలి 2’, ‘ధురంధర్ 2’, ‘పుష్ప 2’ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘దంగల్’ నిలిచింది. ‘రామాయణ’ ఈ రికార్డులను అధిగమించే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నప్పటికీ, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.2,000–2,500 కోట్ల వసూళ్లు అవసరమని నిపుణులు చెబుతున్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలుగులో ఈ సినిమాకు సుమారు రూ.50 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించారు. లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించగా, డీఎన్‌ఈజీ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చేపట్టింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!