

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కథానాయికలు మృణాల్ ఠాకూర్,పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “హై జవానీ తో ఇష్క్ హోనా హై” చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో వరుణ్, మృణాల్ భార్యాభర్తలుగా కనిపిస్తారు. పిల్లల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తారు. అనంతరం విదేశాలకు వెళ్లిన వరుణ్, అక్కడ పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడు.
కథలో కీలక మలుపుగా మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ఇద్దరూ ఒకేసారి గర్భవతులు కావడం చూపించారు. ఈ పరిస్థితిని దాచిపెట్టేందుకు వరుణ్ చెప్పే అబద్ధాలు, ఎదురయ్యే గందరగోళ పరిస్థితులను చాలా వినోదాత్మకంగా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు డేవిడ్ ధావన్ భావోద్వేగానికి లోనవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!