

‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటుడు వడ్డే నవీన్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమా అభివృద్ధి, స్టార్ హీరోల ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో విజయాలను అందుకున్నప్పటికీ, అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సాధించిన ప్రభావం ప్రత్యేకమని ఆయన అభిప్రాయపడ్డారు. భారీ స్థాయిలో రూపొందిన ‘బాహుబలి’ వంటి సినిమా విజయం ముందే ఊహించదగ్గదేనని, రాజమౌళి విజన్ దానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
అయితే ‘పుష్ప’ విడుదల తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన, ముఖ్యంగా హిందీ మార్కెట్లో అల్లు అర్జున్‌కు లభించిన ఆదరణ తనను ఆశ్చర్యపరిచిందని వడ్డే నవీన్ తెలిపారు. ఒక ప్రాంతీయ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం అరుదైన విషయమని, అల్లు అర్జున్ ఆ ఘనతను అద్భుతంగా సాధించారని కొనియాడారు. ఇదే సమయంలో జూన్ 19న విడుదల కానున్న ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంపై కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!