
జనరల్

బలగం సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దర్శకుడు వేణు, తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించనుండగా, హీరోయిన్ ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ నేపథ్యానికి సరిపోయే సహజ నటన కలిగిన హీరోయిన్ను ఎంపిక చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
మొదట సాయి పల్లవి పేరు వినిపించగా, తర్వాత కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి పేర్లు చర్చల్లోకి వచ్చాయి. సరైన హీరోయిన్ ఖరారు అయిన వెంటనే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. బలగం తర్వాత వేణు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!