
సినిమాలు

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ ఉదయభాను గతంలో పంచుకున్న ఓ జ్ఞాపకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ వ్యక్తిత్వం, మాట నిలబెట్టుకునే తత్వం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తన కవల పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకకు ఇండస్ట్రీలోని పలువురిని ఆహ్వానించినప్పటికీ పెద్దగా స్పందన రాలేదని ఉదయభాను తెలిపారు. చివరకు బాలకృష్ణకు సందేశం పంపగా ఆయన వెంటనే ఫోన్ చేసి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. చెప్పినట్లుగానే సమయానికి వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో గడిపారని, ఆ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయిందని ఉదయభాను భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!