

ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు టాలీవుడ్లో భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయడం తెలిసిందే. అదే సంప్రదాయం కొనసాగిస్తూ, 2026 సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలు ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ రెండు చిత్రాల ఓటీటీ హక్కులను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇప్పటికే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రైట్స్‌ను కూడా అదే సంస్థ దక్కించుకుంది.
దీంతో సంక్రాంతి బరిలో నిలిచే ఈ రెండు సినిమాలు థియేటర్లలో ప్రదర్శన అనంతరం జీ5 లోనే స్ట్రీమింగ్ కానున్నాయి అని స్పష్టత వచ్చింది.
ఇందులో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!