

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న గాడ్ ఆఫ్ వార్ చిత్రానికి ఎన్టీఆర్ హీరోగా అధికారిక ప్రకటన రావడంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు తెరపడింది. అయితే ఈ సినిమాలో తొలుత అల్లు అర్జున్ నటించనున్నాడనే ప్రచారం ఎందుకు జరిగిందనే అంశంపై ఇప్పుడు కొత్త కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ కథను మొదటి నుంచే ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశాడని తెలుస్తోంది. దీంతో ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న సందేహాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.
ప్రాజెక్ట్ ప్రకటన ఆలస్యమైన సమయంలో అల్లు అర్జున్ ఈ కథపై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని మరో చిత్రానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ కూడా తాను ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఎన్టీఆర్‌తో సినిమాను అధికారికంగా ప్రకటించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. బన్నీని ఈ సినిమా నుంచి తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదని, పరిస్థితుల కారణంగా ఆయన మరో ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో ఈ భారీ మైథలాజికల్ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!