
రాజకీయాలు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘పెద్ది’ మంచి అంచనాల మధ్య విడుదలై ఏపీ, తెలంగాణాలో మంచి వసూళ్లు రాబట్టింది. విడుదలైన తర్వాత కొన్ని రోజులకే నైజాంలో టికెట్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.
తాజాగా చిత్ర బృందం తెలంగాణలో టికెట్ ధరలను మరింత తగ్గించింది. ఇవాళ్టి నుంచి సింగిల్ స్క్రీన్స్‌లో హై క్లాస్ టికెట్ ధర రూ.105గా ఉండగా, కనిష్ట ధర రూ.50గా నిర్ణయించారు. ఓటీటీ రిలీజ్‌కు ముందు తక్కువ ధరలో సినిమా చూడాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!