
రాజకీయాలు

రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపై పలు ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. చిత్రంలో ఆదివాసీలను కించపరిచేలా కొన్ని పదాలు, సంభాషణలు వినియోగించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సినిమాకు అనుమతి ఇచ్చిన సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, చిత్రంలో పలుమార్లు ఆదివాసీలను అవమానించేలా భావిస్తున్న పదాలను ఉపయోగించారని సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. గిరిజన హక్కులకు సంబంధించిన చట్టాల్లో ప్రస్తావించిన పదాలను అనుచిత సందర్భాల్లో వినియోగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, చిత్రంలోని పదాలను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఆదివాసీ సమాజం మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!