

2026 సంవత్సరంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొననుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ది రాజా సాబ్ విడుదలకానుండగా, జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జనవరి 14న నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాలన్నీ కలిసి సంక్రాంతిని పూర్తి స్థాయి సినిమా పండగగా మార్చనున్నాయి. ఫిబ్రవరిలో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యోధుల కథా చిత్రం స్వయంభు విడుదలకు సిద్ధమవుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమ్యుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.
మార్చి నెల టాలీవుడ్‌కు అత్యంత బిజీగా మారనుంది. మార్చిలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 26న రామ్ చరణ్ నటించిన పెద్ది మరియు నాని హీరోగా తెరకెక్కిన ది పారడైస్ ఒకేసారి విడుదలై భారీ పోటీ నెలకొననుంది. అదే సీజన్లో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ చిత్రం కాకపోయినా ధురంధర్ 2 తెలుగు వెర్షన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది. వేసవిలో చిరంజీవి నటించిన విశ్వంభర విడుదల కావొచ్చని అంచనా కాగా, బాలకృష్ణ–గోపిచంద్ మలినేని చిత్రం కూడా 2026లోనే రానుంది. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ విడుదల మాత్రం నిర్మాణ పురోగతిపై ఆధారపడి ఉంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే 2026లో అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలు విడుదల కావడం లేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!