

రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ : హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది రాజా సాబ్’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన శైలిలో మాట్లాడి అభిమానులను ఉత్సాహపరిచారు. వేదికపైకి వచ్చిన వెంటనే “డార్లింగ్స్.. అందరికీ నమస్కారం” అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, అభిమానుల ప్రేమను చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంత భారీ సంఖ్యలో అభిమానులను చూడటం తనకు ప్రత్యేక ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. కూకట్ పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ అభిమానులతో కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని పంచుకున్నారు, అక్కడి వాతావరణం ఫ్యాన్స్ ఉత్సాహంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా ‘ది రాజా సాబ్’ సినిమా గురించి మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత తాను నటిస్తున్న పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ఇదేనని ప్రభాస్ తెలిపారు. హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ఇందులో కామెడీ మరియు రొమాన్స్ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తాయని వెల్లడించారు. తన కొత్త లుక్కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేసిన ప్రభాస్, దర్శకుడు మారుతి తనను చాలా కొత్తగా, అందంగా చూపిస్తున్నారని ప్రశంసించారు. అలాగే మారుతికి కామెడీ టైమింగ్‌పై అద్భుతమైన పట్టు ఉందని, ఈ సినిమాను ఆయన వేగంగా, క్వాలిటీగా తెరకెక్కిస్తున్నారని అభినందించారు.
ఇక తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలుస్తాయని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా, “మీ అందరినీ ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. ‘రాజా సాబ్’ మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాపై నేను కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. థాంక్యూ సో మచ్ డార్లింగ్స్” అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!